తెలంగాణ విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, ఎంపిక విధానం వివరాలు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) నుంచి రెగ్యులర్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ నేడో రేపో TSNPDCL వెబ్సైట్ www.tsnpdcl.in నందు విడుదల చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 44 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
TSNPDCL పరిధిలోకి 18 జిల్లాలు వస్తాయి. మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్ , మహబూబాబాదు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాదు, కరీంనగర్, ములుగు మరియు ఖమ్మం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు లోకల్ పరిధిలోకి వస్తారు.
👇షార్ట్ నోటిఫికేషన్👇
వెబ్సైట్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి👇