December 7, 2024
All India Govt JobsPolice/Defence

50,187 కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల ఫిజికల్ టెస్ట్ తేదీలు విడుదల.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారీ స్థాయిలో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్ జీడీ/ రైఫిల్ మ్యాన్/ సిపాయి పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి, ఫిబ్రవరి నెలలో నిర్వహించింది. రాత పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.
తాజాగా కానిస్టేబుల్ జీడీ ఫిజికల్ టెస్ట్ (PST/ PET) తేదీలను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లను ఏప్రిల్ 14 నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించింది. CRPF శిక్షణ కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఎప్పటికప్పుడు CRPF అధికారిక వెబ్సైట్ను సందర్శించాని తెలిపింది. అడ్మిట్ కార్డ్ లేని అభ్యర్థులను ఫిజికల్ టెస్ట్ పరీక్షలకు అనుమతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!