TS Police Jobs: ఎస్ఐ తుదిరాత పరీక్ష తేదీలు విడుదల.. హాల్ టికెట్లు ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది రాత పరీక్ష తేదీలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) వెల్లడించింది. ఏప్రిల్ 1న అధికారిక ప్రకటనను వెబ్ సైట్ లో విడుదల చేసింది. తుది రాత పరీక్షలు ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి 1 వరకు , మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 3 నుంచి 6 వ తేదీలోగా అభ్యర్థులు హాల్ టికెట్లను పోలీసు నియామక మండలి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. హాల్ టికెట్ పై అభ్యర్థి ఫొటో అతికించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఎస్ఐ తుది రాత పరీక్షలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో మాత్రమే నిర్వహించనుంది. ఏప్రిల్ 8వ తారీఖున ఉదయం అర్థమెటిక్ & రీజనింగ్ పరీక్షను, మధ్యాహ్నం ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్షను నిర్వహించనుంది. ఏప్రిల్ 9వ తారీఖున ఉదయం జనరల్ స్టడీస్ పరీక్షను, మధ్యాహ్నం తెలుగు లాంగ్వేజ్ పేపర్ పరీక్షను నిర్వహించనుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు పొందగలరు