తెలంగాణలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు..
తెలంగాణ విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL)లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్: 100 పోస్టులు
విద్యార్హతలు:
డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్/ ఆఫీస్ ఆటోమేషన్ (MS-Office) సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 జనవరి 1వ తారీకు నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC/ST/BC/EWS అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
రూ.29,255/- నుంచి రూ.54,380/- వరకు
ఎంపిక విధానం:
రాతపరీక్ష మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
2023 మే 28వ తారీఖున రాతపరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
10-04-2023 తేదీ నుంచి 29-04-2023 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి