TS SI Constable Recruitment 2023: సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించిన తుది పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను ఈ నెల 14 నుంచి 26వ తేదీ వరకు చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 సెంటర్లను ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన ఇంటిమేషన్ లెటర్లను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోగలరు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో ఆ లెటర్ను చూపించాల్సి ఉంటుంది. ఇంటిమేషన్ లెటర్ జూన్ 11న ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవటానికి అందుబాటులో ఉంటుంది. 18 సెంటర్లలో మొత్తం 1,09,906 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనున్నది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రంలోనే అప్లికేషన్ ఎడిటింగ్/మాడిఫై చేసుకునే అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా మార్కుల వెయిటేజీ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్టీఏ ధ్రువీకరించిన సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కు వచ్చే అభ్యర్థులు విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ, బీసీ అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్, ఈడబ్ల్యూఎస్, ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లు ఒరిజినల్స్, జిరాక్స్ సెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి ఇంటిమేషన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి