TS Outsourcing Jobs: తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్ లైన్ (కామారెడ్డి)లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, కౌన్సెలర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: 01 పోస్టు
2.కౌన్సెలర్: 01 పోస్టు
3.చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్: 03 పోస్టులు
4.కేస్ వర్కర్: 03 పోస్టులు
విద్యార్హతలు:
సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
2023 జూన్ 1వ తారీకు నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులకు: రూ.28,000;
కౌన్సెలర్ పోస్టులకు: రూ.18,536;
చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ పోస్టులకు: రూ.19,500;
కేస్ వర్కర్ పోస్టులకు: రూ.15,600.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, రూమ్ నం.31, WCD & SC, IDOC, కలెక్టరేట్, కామారెడ్డి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
2023 జూన్ 13వ తారీకు సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి