TS Govt Jobs | గ్రూప్-1,2,3,4, పోలీస్.. అన్నీ భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతిహామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతిహామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. నిరుద్యోగులు కొద్దిగా సంయమనం పాటిస్తే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రక్షాళన చేసి త్వరలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రజాభవన్లో వినతి పత్రాలు సమర్పించిన నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజాదర్బార్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించడంతో పాటు సమస్యలపై స్పందిస్తూ వినతిపత్రాలను సంబంధింత అధికారులకు ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా విద్యార్థి నిరుద్యోగ సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించి త్వరితగతిన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కొద్దిగా సంయమనం పాటిస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళచేసి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గ్రూప్-1,2,3,4; ఎస్సై కానిస్టేబుల్ తదితర ఉద్యోగాల భర్తీకి ఈ సంవత్సరంలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.
✅అతి తక్కువ ధరకే “TS గ్రూప్-2,3,4; SI/కానిస్టేబుల్; SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
✅ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి