తెలంగాణ గ్రూప్-4 కు ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులకు దరఖాస్తులు 8 లక్షలు దాటాయి. ఆదివారం సాయంత్రానికి 8,00,004 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు. ప్రభుత్వ విభాగాల్లో 8,039 గ్రూప్-4 పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఇటీవల అదనంగా 141 పోస్టులను కలిపారు. దీంతో మొత్తంగా 8,180 గ్రూప్ 4 పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. చాలా సంవత్సరాల తరువాత గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. రోజురోజుకీ క్రమంగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. రోజుకి సగటున 25 వేల పైనే దరఖాస్తులు వస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉండటంతో వీటి సంఖ్య 9 లక్షలకు చేరువయ్యే అవకాశముంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి