TS Govt Jobs: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు
TS Government Jobs: తెలంగాణ రాష్ట్రంలో 1,931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును అక్టోబర్ 3వ తారీకు వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది..
తెలంగాణ రాష్ట్రంలో, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జూలై 26న 1,520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (Female) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మరో 411 పోస్టులను పెంచింది. కొత్త ఉద్యోగాలతో కలిపి భర్తీ చేసే మొత్తం పోస్టుల సంఖ్య 1,931 కి పెరిగాయి. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 19వ తారీకుతో ముగిసింది. అయితే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు దరఖాస్తు గడువును అక్టోబర్ 3వ తారీకు వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా దరఖాస్తు చేసుకోనటువంటి అభ్యర్థులకు మరొక్క అవకాశం కల్పించింది.
పోస్టుల వివరాలు:
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమెల్) పోస్టులు.
మొత్తం ఖాళీలు: 1,931.
విద్యార్హతలు:
అభ్యర్థులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (Female) ట్రైనింగ్ కోర్సు పూర్తి చేయాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉత్తీర్ణత. మిడ్వైఫరీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 18 నుంచి 49 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంపిక విధానం:
రాతపరీక్ష, పని అనుభవం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.
పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.
అప్లికేషన్ ఫీజు:
రూ.500/- ఫీజు చెల్లించాలి
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది:
2023 అక్టోబర్ 3వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి