TG Job Calendar 2024: తెలంగాణలో జాబ్ క్యాలెండర్ పై సీఎం క్లారిటీ.. గ్రూప్-2,3,4; ఎస్సై/ కానిస్టేబుల్.. అన్ని శాఖల్లోని పోస్టులు భర్తీ
Telangana Job Calendar: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.
✅నిరుద్యోగుల కోసం: SSC MTS.. SSC GD Constable.. RPF Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకొని మీకు కావలసిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకనుంచి ప్రతి సంవత్సరం అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి 31వ తారీకు లోపు అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి, జూన్ 2వ తారీకు లోపు నోటిఫికేషన్లు విడుదల చేసి, డిసెంబర్ 9వ తారీఖు నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ తరహాలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. ఉద్యోగుల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ద్వారా గ్రూప్-1,2,3,4 విభాగాల్లో ఖాళీ పోస్టులను, అలాగే పోలీస్ శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ.. ఇలా అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు.