AP Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Anganwadi Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ వర్కర్, మినీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం పదవ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 87 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అంగన్వాడీ వర్కర్: 11, మినీ అంగన్వాడి వర్కర్: 18, అంగన్వాడి హెల్పర్: 58 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
జీతభత్యాలు:
అంగన్వాడీ వర్కర్: రూ.11,500/-
మినీ అంగన్వాడి వర్కర్: రూ.7,000/-
అంగన్వాడి హెల్పర్: రూ.7,000/-
ఈ పోస్టులకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కులు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. Offline దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలెను. దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కులం, నివాసం, పుట్టిన తేదీ, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచాలి.
మరిన్ని వివరాలకు సంబంధిత సీడీపీవో కార్యాలయంలో సంప్రదించగలరు. అర్హత కలిగిన అభ్యర్థులు 2024 జూలై 19వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు