Telangana District Court Jobs: 10th క్లాస్ అర్హతతో తెలంగాణ జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 130 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంభందించిన పూర్తీ  వివరాలు తెలుసుకుందాం..

📌Join Our Whatsapp Group

🎯Join Our Telegram Group

▶️Organization Details:

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

▶️Vacancies Details: 

ప్రాసెస్ సర్వర్: 130 పోస్టులు

▶️Education Qualifications: 

10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

TSLPRB ASI Notification 2026: తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ASI ఉద్యోగాలు భర్తీ | అర్హత, వయస్సు, జీతం, ఎంపిక విధానం

▶️Age limit: 

18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

▶️Salary: 

పోస్టును అనుసరించి రూ.22,900 నుంచి రూ.69,150 వరకు జీతం ఉంటుంది.

▶️Selection Process:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

▶️Syllabus:

45 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 30 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 15 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్టు నుంచి వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్షకు 60 నిమిషాలు సమయం ఉంటుంది.

రాతపరీక్షలో క్వాలిఫై కావటానికి ఓసీ అభ్యర్థులకు 40% మార్కులు; బీసీ అభ్యర్థులకు 35% మార్కులు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30% మార్కులు రావాలి.

రాత పరీక్షలో మెరిట్ వచ్చిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఐదు మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

TSLPRB SI Notification 2026: తెలంగాణ పోలీసు శాఖలో ఎస్సై ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

▶️Apply Process: 

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత.. రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఆధారంగా చేసుకుని ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫారం నింపాలి.

▶️Examination Fee: 

ఓసి, బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.

▶️Apply Dates: 

08-01-2025 తేదీ నుంచి 31-01-2025 తేదీ వరకు హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Note: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

Hydraa Assistant Notification 2026: తెలంగాణ హైడ్రాలో 10th అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: “జిల్లా కోర్టు/ హైకోర్టు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్+Test Series “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!