Constable Jobs: 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1105 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ.. చివరి తేదీ: 31-12-2025
SSC GD Constable: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 25,487 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా డిసెంబర్ 8వ తారీఖున రాష్ట్రాలవారీగా, కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను విడుదల చేసింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 1105 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ససస్త్ర సీమాబల్ (SSB), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), అస్సాం రైఫిల్స్ (AR) విభాగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టల్లను భర్తీ చేస్తారు.
SSC GD Constable Vacancies
దేశవ్యాప్తంగా 25,487 పోస్టులు ఖాళీగా ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 611 పోస్టులు (పురుషులు: 564, మహిళలు:47); తెలంగాణ రాష్ట్రానికి 494 పోస్టులను (పురుషులు: 455, మహిళలు: 39) కేటాయించారు.
SSC GD Constable Eligibility
ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి 23 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Apply Process
ఈ ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 డిసెంబర్ 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Selection Process
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ద్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాషలోనూ ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు భాషలో, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ భాషలో పరీక్ష రాయవచ్చు.

