December 7, 2024
All India Govt Jobs

Railway Jobs: రైల్వే శాఖలో 3 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు

రైల్వే శాఖలో 3 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో గ్రూప్-సి విభాగంలో 3,11,438 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. గ్రూప్-సి విభాగంలో క్లర్క్, స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ మొదలగు పోస్టులు ఉంటాయి. మరోవైపు గెజిటెడ్ క్యాడర్ హోదాలో 3,018 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. రైల్వే నియామకాలపై దాఖలైన RTI పిటిషన్కు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. దాదాపు అన్ని రైల్వే జోన్లలోనూ సిబ్బంది కొరత ఉన్నట్లు పేర్కొంది.
ఈ ఉద్యోగాల భర్తీకి రాబోయే రోజుల్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. వీటితోపాటుగా రైల్వే శాఖలో RPF ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!