AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వైయస్సార్ కడప జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH) నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేస్తున్నారు. Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
డాక్టర్ పోస్టు 1, అనిస్తీషియా టెక్నీషియన్ 6, ఈసీజీ టెక్నీషియన్ 3, ఈఈజి టెక్నీషియన్ 1, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 3, మార్చరీ అటెండెంట్ 1, ఆఫీస్ సబార్డినేట్ 2, వార్డ్ బాయ్ 1, స్ట్రెచర్ బాయ్ 1, ఎంఎన్ఓ 2 పోస్టులు.
మొత్తం: 21 పోస్టులు
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 8వ తరగతి, పదవ తరగతి, బీఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.11,000/- నుంచి రూ.60,000/-
ఎంపిక విధానం:
మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. అక్కడమిక్ మార్కులను పరిగణనలోనికే తీసుకొని 75% మార్కులు కేటాయిస్తారు. ఇతర నిబంధనల ప్రకారం మరో 25% మార్కులు ఉంటాయి. రాత పరీక్ష ఉండదు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ: 08-03-2023
చిరునామా: Office of the Superintendent, Govt. General Hospital, Kadapa.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోగలరు