AP Police Jobs: కానిస్టేబుల్ రాతపరీక్ష ప్రశ్నపత్రంలో 8 ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష ప్రశ్నపత్రంలో ఎనిమిది ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదంటూ 80 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ప్రశ్నలకు జవాబులు నిర్ణయించే అంశాన్ని నిపుణుల కమిటీకి పంపేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని కోరారు. జవాబులపై తమ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని కోరారు. తమను దేహదారుఢ్య పరీక్షకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. మొత్తం 80 మంది అభ్యర్థుల తరపున న్యాయవాది గురువారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం హైకోర్టులో త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.