Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకం.. పలు రాష్ట్రాల గవర్నర్ లను మార్చిన కేంద్ర ప్రభుత్వం..

పలు రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను చత్తీస్ఘడ్ గవర్నర్ గా నియమించారు. మహారాష్ట్రకు రమేశ్ బైస్, సిక్కిం రాష్ట్రానికి లక్ష్మణ్ ప్రసాద్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ రాష్ట్రానికి రాధాకృష్ణన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి శివప్రసాద్ శుక్లా, మణిపూర్ రాష్ట్రానికి అనసూయ, నాగాలాండ్ రాష్ట్రానికి గణేషన్, బీహార్ … Read more

TSPSC: 783 గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు దగ్గర పడుతోంది.. వెంటనే అప్లై చేయండి

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 783 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల దరఖాస్తుకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే భారీ స్థాయిలో దరఖాస్తులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసిన నాటికి 5లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని … Read more

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లాలోని జిల్లా జైలు ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: 1.ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 01 పోస్టు2.ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 01 పోస్టు3.మేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 01 పోస్టు విద్యార్హతలు: పదో … Read more

SSC: కానిస్టేబుల్ (GD) రాష్ట్రాల వారీగా ఖాళీలు విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 3,439 పోస్టులు..

కానిస్టేబుల్ GD ఖాళీల వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ కేటగిరి అభ్యర్థులకు ఎన్ని పోస్టులను రిజర్వ్ చేశారు అనే పూర్తి సమాచారాన్ని విడుదల చేసింది. SSC కానిస్టేబుల్ GD నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 46,435 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3,439 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,228 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 1,211 పోస్టులు … Read more

SSC: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పలు ఉద్యోగ రాతపరీక్షల తేదీలు విడుదల..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పలు ఉద్యోగాల రాతపరీక్షల తేదీలు ప్రకటించింది. SSC CHSL Tier-1 మరియు SSC CGL Tier-2 పరీక్షల తేదీలను SSC అఫీషియల్ వెబ్సైట్ లో విడుదల చేసింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ టైర్-1 పరీక్షను 2023 మార్చి 9వ తారీకు నుంచి 2023 మార్చి 21వ తారీకు వరకు నిర్వహిస్తారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్-2 పరీక్షను 2023 మార్చి 2వ తారీకు నుంచి 2023 మార్చి 7వ … Read more

తెలంగాణ చేనేత జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రంలో చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. హైదరాబాదులోని తెలంగాణ చేనేత జౌళి శాఖ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 15 విద్యార్హతలు: డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ తోపాటు చేనేత రంగంలో … Read more

AP SSC Hall Tickets 2023: మార్చి 15 తర్వాత పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మార్చి 15 తర్వాత వెబ్సైట్లో పెట్టనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లను ప్రధానోపాధ్యాయులతో పాటు విద్యార్థులు నేరుగా వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నామని వెల్లడించారు. పాఠశాల ఫీజు కట్టలేదని కొన్ని స్కూళ్లు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

TS DSC 2023: 20 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. ఎప్పుడు విడుదల చేస్తారంటే..

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త తెలిపారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు శాసనమండలి వేదికగా మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ముగిసిన అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మార్చి చివరికల్లా పూర్తి కానుందన్నారు. అనంతరం డీఎస్సీ నోటిఫి కేషన్ వెలువడనుందన్నారు. బదిలీల తర్వాత ఎక్కడెక్కడ ఉపాధ్యాయ పోస్టులు … Read more

TS Police Events 2023: ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ హాల్ టికెట్లు విడుదల.. 7 మార్కులతో క్వాలిఫై అయిన వారివి

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల్లో.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏడు మార్కులు కలపడంతో ఇటీవల క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుండి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను TSLPRB విడుదల చేసింది. అడ్మిట్ కార్డులను అభ్యర్థులు ఫిబ్రవరి 8వ తారీకు ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తారీకు రాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులు … Read more

TS Police Jobs: ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. ఈవెంట్స్ కు మరొక్క ఛాన్స్

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ అభ్యర్థులకు TSLPRB మరో మంచి శుభవార్త తెలిపింది. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్ ముగిశాయి. కేవలం మెయిన్స్ పరీక్షలు మాత్రమే మిగిలాయి. అయితే ఫిజికల్ ఈవెంట్స్ లో ఎత్తు విషయంలో క్వాలిఫై కాలేకపోయిన చాలా మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 1 సెంటిమీటర్, అంత కంటే తక్కువ ఎత్తులో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల … Read more

error: Content is protected !!