APPSC: గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీలో కొత్త నిబంధనలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూపు-2 , గ్రూపు-3 ఉద్యోగాల భర్తీలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గ్రూపు-2 , గ్రూపు-3 ఉద్యోగాల భర్తీకి ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (CPT) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వంద మార్కులకు గానూ సీపీటీ నిర్వహించనున్నట్టు సాధారణ పరిపాలనా … Read more

TSPSC: రేపే డీఏవో రాతపరీక్ష.. ఒక్కోపోస్టుకు 2,005 మంది పోటీ

తెలంగాణ రాష్ట్రంలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 26న రాతపరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 53 ఉద్యోగాలకు అత్యధికంగా 1,06,263 దరఖాస్తులు రాగా, ఒక్కో పోస్టుకు సగటున 2,005 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 53 డీఏవో ఉద్యోగాల … Read more

TSLPRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్చి 2 నుంచి ట్రేడ్ టెస్టులు నిర్వహణ..

పోలీస్ ట్రాన్స్ పోర్టు కానిస్టేబుల్ అభ్యర్థులకు డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ టెస్టులు మార్చి 2 నుంచి నిర్వహించను న్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది. వీరితోపాటు విపత్తు నిర్వహణ, అగ్నిమాపక విభాగంలో డ్రైవర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా శరీర దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు డ్రైవింగ్, ట్రేడ్ పరీక్షలు నిర్వ హిస్తున్నారు. మార్చి 2 నుంచి 21 వరకు డ్రైవింగ్, ట్రేడ్ టెస్టులు నిర్వహిస్తారు. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ … Read more

తెలంగాణలో మరో 11,687 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో 11,687 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREIRB) ముమ్మర కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. మొత్తంగా గురుకులాల్లో 11,687 పోస్టులను గుర్తించారు. నోటిఫికేషన్ల విడుదల మొదలు పరీక్ష తేదీల ఖరారు వరకు అనుసరించాల్సిన ప్రణాళికలను TREIRB రూపొందిస్తోంది. ముందుగా గురుకుల కళాశాలల్లోని డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ చేపట్టి, ఆ తర్వాత ప్రిన్సిపల్ పోస్టులు, పీజీటీ, టీజీటీ, … Read more

TSPSC: గ్రూప్-3 ఒక్కో పోస్టుకు 390 మంది పోటీ.. ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-3 ఉద్యోగాల దరఖాస్తు గడువు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 1,375 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 390 మంది పోటీ పడనున్నారు. చివరి 24 గంటల్లో 58,245 దరఖాస్తులు వచ్చాయి. త్వరలోనే గ్రూప్-3 పరీక్ష తేదీలు ఖరారు గ్రూప్ 3 సర్వీసు పోస్టుల దరఖాస్తు గడువు ముగియడంతో … Read more

12,523 ఎంటీఎస్ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు.. 10th క్లాస్ పాసైతే చాలు

12,523 ఎంటీఎస్ & హవాల్దార్ ఉద్యోగాల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. శుక్రవారం రాత్రి 12 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 12,523 పోస్టుల భర్తీకి SSC నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసైతే చాలు. తెలుగులో కూడా రాతపరిక్ష ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ssc.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: MTS: 11,994 పోస్టులుహవాల్దార్: 529మొత్తం: … Read more

AP High Court Results: హైకోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల.. ఫలితాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ఉద్యోగాల ఆన్లైన్ రాతపరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 11 రకాల పోస్టులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్షను 2023 జనవరి 20వ తారీఖున నిర్వహించిన విషయం తెలిసిందే. సెక్షన్ ఆఫీసర్: 09అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 13కంప్యూటర్ ఆపరేటర్: 11ఓవర్సీర్: 01అసిస్టెంట్ ఓవర్సీర్: 01ఎగ్జామినర్: 13టైపిస్ట్: 16కాపీయిస్ట్: 20డ్రైవర్: 08అసిస్టెంట్: 14ఆఫీస్ అవార్డినేట్: 135పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ … Read more

AP గ్రామ సచివాలయం రాతపరీక్షలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి..

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయం కేటగిరి-1 ఉద్యోగాల రాతపరీక్షలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 టాపిక్ నుంచి ఐదు ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంది. 2020 సెప్టెంబర్ 20వ తేదీన నిర్వహించిన కేటగిరి-1 పోస్టుల రాతపరీక్షలో ఈ టాపిక్ నుంచి ఐదు ప్రశ్నలు వచ్చాయి. కేటగిరి 1 విభాగంలోనికి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఉద్యోగాలు, మహిళా పోలీస్ ఉద్యోగాలు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు వస్తాయి. గత పరీక్షలో … Read more

TSPSC: 1,375 గ్రూప్-3 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు.. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు..

తెలంగాణ గ్రూప్-3 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు గడువు గురువారం సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. ఇప్పటివరకు 4.70 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,375 గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: గ్రూప్-3: 1,375 పోస్టులు దరఖాస్తు విధానం: … Read more

10th క్లాస్ అర్హతతో 12,523 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు

10th క్లాస్ అర్హతతో 12,523 ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాల దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఫిబ్రవరి 24 రాత్రి 12 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 12,523 ఎంటీఎస్ మరియు హవాల్దార్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పురుష అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసైతే చాలు. తెలుగులో కూడా రాతపరీక్ష ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. … Read more

error: Content is protected !!