October 9, 2024
TS Govt Jobs

తెలంగాణలో మరో 11,687 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో 11,687 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREIRB) ముమ్మర కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. మొత్తంగా గురుకులాల్లో 11,687 పోస్టులను గుర్తించారు. నోటిఫికేషన్ల విడుదల మొదలు పరీక్ష తేదీల ఖరారు వరకు అనుసరించాల్సిన ప్రణాళికలను TREIRB రూపొందిస్తోంది.

ముందుగా గురుకుల కళాశాలల్లోని డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ చేపట్టి, ఆ తర్వాత ప్రిన్సిపల్ పోస్టులు, పీజీటీ, టీజీటీ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయాలని ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇప్పటికే రోస్టర్ ప్రాతిపదికన ఆయా పోస్టుల రిజర్వు ప్రక్రియను పూర్తి చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆయా పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను జారీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREIRB) సిద్ధంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!