APPSC: గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీలో కొత్త నిబంధనలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూపు-2 , గ్రూపు-3 ఉద్యోగాల భర్తీలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గ్రూపు-2 , గ్రూపు-3 ఉద్యోగాల భర్తీకి ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (CPT) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే వారంతా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వంద మార్కులకు గానూ సీపీటీ నిర్వహించనున్నట్టు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో SC, ST, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!