December 20, 2024
AP Govt Jobs

APPSC: గ్రూప్-2 ప్రిలిమ్స్ వాయిదా లేదు.. ఆ సమస్యకు పరిష్కారం చూపిన ఏపీపీఎస్సీ

APPSC Group 2 Prelims: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగిపోయే విధంగా చర్యలు తీసుకుంది.

✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our APP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 25న నిర్వహించనున్న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటివరకు దాదాపు 3.40 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. కాగా ఈ నెల 25న ప్రిలిమ్స్ పరీక్ష రోజే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మెయిన్స్ పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీపీఎస్సీ అధికారులు.. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ కు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ తేదీని డిసెంబర్లోనే ప్రకటించామని తెలిపారు. ఈ పరీక్షకు 4,83,525 మంది చేసుకున్నారని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిచేశామని వివరించారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2తో పాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా మార్చి 4న జరిగే ఎస్బీఐ స్లాట్లో వారికి అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్బీఐ అధికారులు.. ఈనెల 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే ఎస్బీఐ అభ్యర్థులకు మార్చి 4న జరిగే స్లాట్లో అవకాశం కల్పించేందుకు అంగీకరించారు. దీంతో రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ సేకరిస్తోంది.

ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ తోపాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులు తమ వివరాలను తమకు పంపాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 19 రాత్రి 12 గంటలలోగా appschelpdesk@gmail.com మెయిల్ చేయాలని సూచించింది.

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!