APPSC Group 2 | 897 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. గడువు వారం రోజులే.. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, దరఖాస్తు వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group 2 Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు వారంలో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 52 శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను 2024 ఫిబ్రవరి 25వ తారీకున నిర్వహించనున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మరో వారం రోజుల్లో ముగియనున్నది. 2024 జనవరి 10వ తారీకు వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్టార్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత, వయస్సు, జీతం, సిలబస్, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం…

ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 331
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566
మొత్తం పోస్టుల సంఖ్య: 897
Note: కేటగిరీల వారీగా, శాఖల వారీగా, జోన్ల వారీగా ఖాళీల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకు పై క్లిక్ చేయండి.

2023 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Note: సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 పోస్టులకు 20 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

APPSC Group-1 Notification 2026 | ఏపీలో ఏదైనా డిగ్రీ అర్హతతో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టును అనుసరించి నెలకు రూ.25,220/- నుంచి రూ.1,30,580/- వరకు జీతం ఉంటుంది.

స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నిర్వహిస్తారు.
Note: ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తో పాటు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఫిజికల్ టెస్టుల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫీజు: రూ.250/-
పరీక్ష ఫీజు: రూ.80/-
SC/ST/BC అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

AP Police Communication Constable Notification 2026 – ఏపీ పోలీసు శాఖలో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
2023 డిసెంబర్ 21వ తారీకు నుంచి 2024 జనవరి 10వ తారీకు వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

స్క్రీనింగ్ టెస్ట్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో టాపిక్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 & పేపర్-2) ఉంటాయి. ప్రతి పేపర్ నుంచి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 పరీక్షలో భారత దేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్ పరీక్షలను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.

Notification Link

Group-2 Syllabus

AP Govt Jobs 2026: ఏపీ అగ్నిమాపక శాఖలో 10th అర్హతతో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Official Website

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!