December 6, 2024
AP Govt Jobs

APPSC Group-2 | 750 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్

APPSC Group-2 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 750 పైగా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 508 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఈ పోస్టులకు అదనంగా మరో 240 పైగా పోస్టులను జత చేసి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగే సుధీర్ గారు బుధవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. రోస్టర్ ప్రక్రియ ముగిసిన వెంటనే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో దాదాపు 750 పైగా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!