APPSC Group-2 | గ్రూప్-2 డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాల భర్తీ.. అర్హత, వయస్సు, సిలబస్, ఎంపిక విధానం వివరాలు..
APPSC Group 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ విభాగాల్లో మొత్తం 508 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీపీఎస్సీ కి అనుమతి తెలుపుతూ జీవో జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 508 గ్రూప్-2 ఉద్యోగాల్లో రెవెన్యూ శాఖ నుంచి 114 డిప్యూటీ తహసీల్దార్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
పోస్టుల వివరాలు:
డిప్యూటీ తహసీల్దార్ (గ్రేడ్-2): 114 పోస్టులు
విద్యార్హతలు:
ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
SC/ ST/ BC/ EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ప్రిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సిలబస్ వివరాలు:
స్క్రీనింగ్ టెస్ట్
స్క్రీనింగ్ టెస్ట్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో టాపిక్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
మెయిన్స్
మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 & పేపర్-2) ఉంటాయి. ప్రతి పేపర్ నుంచి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 పరీక్షలో భారత దేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్ పరీక్షలను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 సిలబస్ PDF డౌన్లోడ్ చేసుకోగలరు
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి