APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23 కు వాయిదా!.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC Group-2 Mains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23వ తారీకున నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది.

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Whatsapp Group Link

Telegram Group Link

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ఈరోజు (మంగళవారం) అధికారిక వెబ్సైట్లో వెబ్ నోట్ విడుదల చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జనవరి 5వ తారీఖున నిర్వహించాలి. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల సన్నద్ధతను దృష్టిలో పెట్టుకుని.. అలాగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ తేదీని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ గతంలో వెల్లడించింది. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడడంతో పాటు, అభ్యర్థుల నుంచి వస్తున్న వినతుల మేరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

గత కొద్దిరోజులుగా గ్రూప్-2 అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నాయకులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్న విషయం తెలిసిందే. ప్రిపరేషన్ కు కనీసం మూడు నెలల గడువు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా డిసెంబర్ చివరి వారంలో కానిస్టేబుల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్న కారణంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!