TSPSC Group 2: తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు నిర్వహణపై సందిగ్ధం!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSPSC Group-2: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక మరోసారి వాయిదా పడతాయా? ఈ విషయమై గ్రూప్-2 అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది.

Download Our App

Telangana Anganwadi Jobs 2026: మెదక్ జిల్లాలో 163 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ | ఇంటర్ అర్హత | పరీక్ష లేదు, ఫీజు లేదు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 రాత పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక మరోసారి వాయిదా పడతాయా? ఈ విషయమై గ్రూప్-2 అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. 2024 జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా? యధావిధిగా నిర్వహిస్తారా? అనే విషయమై టీఎస్పీఎస్సీ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో గ్రూప్-2 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన లక్షల మంది నిరుద్యోగులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్ తో పాటు ఐదుగురు సభ్యులు ఉండేవారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చైర్మన్ సహా ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను గవర్నర్ కార్యాలయానికి పంపారు. కాగా చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు. అయితే రాజీనామా పత్రాలు పంపిన వారెవరూ కమిషన్ కార్యాలయానికి రావడం లేదు.

ప్రస్తుతం టీఎస్పీఎస్సీ బోర్డులో ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో సీనియర్ సభ్యులైన ఒకరికి యాక్టింగ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాని కంటే ముందు చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాలి. లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకు గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Adilabad District Anganwadi Jobs 2026: ఆదిలాబాద్ జిల్లాలో 242 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Our App

TG Anganwadi Notification 2026 – తెలంగాణలో 179 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!