TSPSC: గ్రూప్-4 పరీక్షలో జంబ్లింగ్ ప్రశ్నలు.. ఎవరూ ఊహించని ట్విస్ట్
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్షల నిర్వహణలో ఈసారి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. అందులో కీలకమైన వాటిలో ప్రశ్నల జంబ్లింగ్ విధానం ఒకటి. గతంలో A, B, C, D సిరీస్ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ సిరీస్లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు. ఆ ప్రశ్నలను కంప్యూటర్లో జంబ్లింగ్ చేశారు. ఎక్కువ సిరీస్లలో ప్రశ్నపత్రాలను ముద్రించారు. దీనివల్ల మాస్ కాపీయింగ్ కు పూర్తిగా చెక్ పెట్టొచ్చు. అదేవి ధంగా, బబ్లింగ్ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీకు కేటాయించిన నంబర్ ను ఓఎంఆర్ షీటులో సరిగా బబ్లింగ్ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్ సంతకాలు లేకపోయినా అతని పేపర్ను మూల్యాంకనం చేయరు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి