TSPSC: గ్రూప్-4 పరీక్షలో ప్రతి అరగంటకు ఓ గంట.. అభ్యర్థులకు అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 రాతపరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. గ్రూప్-4 పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రంలోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పేపర్-1కు 9.45, పేపర్-2కు 2.15కే పరీక్ష గేట్లు మూసివేస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో ప్రశ్నపత్రాలిస్తారు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులెవరూ మొబైల్ ఫోన్లు, చేతి వాచీలు, క్యాలుక్యులేటర్లు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. పరీక్ష రాసే సమయంలో ప్రతి అరగంటకు ఓ సారి గంట మోగిస్తూ అభ్యర్థులను అప్రమత్తం చేస్తారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి