TSPSC Group-2: గ్రూప్-2 పరీక్ష తేదీలు ఫిక్స్ అయ్యాయి.. తేదీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల రాతపరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించటానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ప్రశ్న పత్రాల లీకేజీ కారణంగా పలు ఉద్యోగాల రాత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలను మాత్రం యథావిధంగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. 29వ తేదీ ఉదయం పేపర్-1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం పేపర్-2 (చరిత్ర, రాజకీయం, సమాజం) పరీక్ష జరగనుంది. అలాగే 30వ తేదీ ఉదయం పేపర్-3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి), మధ్యాహ్నం పేపర్-4 ( తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) పరీక్ష జరగనుంది. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కోమార్కు. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులు ఉంటాయి. గతంలో ఇంటర్వ్యూ ఉండేది, ఈసారి దాన్ని తొలగించారు. గ్రూప్-2 ఉద్యోగాలకు భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.

TG District Court Jobs 2026 | తెలంగాణలో 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

డిగ్రీ అర్హతతో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు భర్తీ | జీతం: రూ.45,960 | TGPSC Pollution Control Board Notification 2026

Join Our Telegram Group

TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!