TSPSC: గ్రూప్-2 ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో వచ్చిన దరఖాస్తులు.. ఎన్ని లక్షలు వచ్చాయంటే

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. బుధవారం సాయంత్రానికి 4,83,640 దరఖాస్తులు వచ్చాయి. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 5గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసేసరికి 5లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రూప్-2 ఉద్యోగాలకు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

గ్రూప్-2: 783 పోస్టులు

దరఖాస్తు విధానం:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
2023 జనవరి 18వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

TG TRANSCO Recruitment 2026 Notification
TG TRANSCO Recruitment 2026 – తెలంగాణ విద్యుత్ శాఖలో 250 పోస్టులు భర్తీ | పరీక్ష లేదు, ఫీజు లేదు

విద్యార్హతలు:

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులకు 21 నుంచి 30 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

Telangana Job Mela 2026
Job Mela 2026 – తెలంగాణలో 10th, ఇంటర్, డిగ్రీ వారికి ఉద్యోగాలు | ₹18,000 Salary

రూ.38,890/- నుంచి 1,18,230/- వరకు

ఎంపిక విధానం:

రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 600 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు

Notification Link

Warangal Court Office Attendant Jobs
10th పాసైతే చాలు 🔥 వరంగల్ కోర్టులో Office Attendant Jobs 2026 | పరీక్ష లేదు

Apply Online

Official Website

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!