10th అర్హతతో తెలంగాణలో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు భర్తీ || Telangana Process Server Notification 2025
తెలంగాణ జిల్లా కోర్టుల్లో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 130 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు మూడు రోజుల్లో ముగియనున్నది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 8వ తారీకు నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి జ్యుడీషియల్ మినిస్టీరియల్ మరియు సబార్డినేట్ సర్వీస్ కింద ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా 130 ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
👉విద్యార్హతలు:
10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
👉వయోపరిమితి:
01-07-2025 తేదీ నాటికి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
ఈ ఉద్యోగాలు పొందే అభ్యర్థులకు నెలకు రూ.22,900 నుంచి రూ.69,150 వరకు జీతం ఉంటుంది.
👉 సెలక్షన్ ప్రాసెస్:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉పరీక్ష విధానం:
45 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 30 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 15 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్టు నుంచి వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్షకు 60 నిమిషాలు సమయం ఉంటుంది.
రాతపరీక్షలో క్వాలిఫై కావటానికి ఓసీ అభ్యర్థులకు 40% మార్కులు; బీసీ అభ్యర్థులకు 35% మార్కులు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30% మార్కులు రావాలి.
రాత పరీక్షలో మెరిట్ వచ్చిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఐదు మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉అప్లై చేయు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత.. రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఆధారంగా చేసుకుని ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫారం నింపాలి.
👉పరీక్ష ఫీజు/ దరఖాస్తు ఫీజు:
ఓసి, బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.
👉దరఖాస్తు తేదీలు:
08-01-2025 తేదీ నుంచి 31-01-2025 తేదీ వరకు హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: “జిల్లా కోర్టు/ హైకోర్టు, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్+Test Series “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.