TSPSC Group-4 | గ్రూప్-4 ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారంటే?
TSPSC Group-4 Results 2023: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలను అక్టోబర్ రెండో వారం లోపు విడుదల చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలు విడుదలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ‘కీ’, తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. ఫలితాలను అక్టోబర్ నెలలోనే ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. గ్రూప్-4 కేటగిరిలో వివిధ విభాగాల్లో 8,180 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2)ను జులై 1న నిర్వహించారు. పేపర్-1 పరీక్షకు 7,63,835 మంది, పేపర్-2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. ఆగస్టు 28న ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ కమిషన్ కు తుది నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అన్నింటినీ ఒకటికి రెండుసార్లు పరిశీలించిన టీఎస్పీఎస్సీ.. వారం, పది రోజుల్లో గ్రూప్-4 ఫైనల్ కీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. తుది ఫలితాలను అక్టోబర్ రెండో వారంలోపు ఇవ్వాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి