TSPSC Group-4 Results | తెలంగాణ గ్రూప్-4 ఫలితాల అప్డేట్
TSPSC Group-4 | తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలను అక్టోబర్ నెలలో విడుదల చేసి, ధృవీకరణ పత్రాలను పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కసరత్తు చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలను అక్టోబర్ నెలలో విడుదల చేసి, ధృవీకరణ పత్రాలను పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-4 రాతపరీక్ష యొక్క ప్రిలిమినరీ ‘కీ’ ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ‘కీ’పై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించనున్నది. అభ్యంతరాలు ముగిసిన తర్వాత 15 రోజుల్లో తుది ‘కీ’ విడుదల చేయనుంది. అలాగే పరీక్షకు సంబంధించిన OMR షీట్ల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ తెలిపింది. సెప్టెంబర్ 27 వరకు అవి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. తెలంగాణలో గ్రూప్-4 కేటగిరిలో వివిధ విభాగాల్లో 8,180 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్ష (పేపర్-1, పేపర్-2)ను జులై 1న నిర్వహించారు. పేపర్-1 పరీక్షకు 7,63,835 మంది, పేపర్-2 పరీక్షకు 7,61,026 మంది హాజరయ్యారు. గ్రూప్-4 ఫలితాలను అక్టోబర్ లో విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-4 రాతపరీక్ష యొక్క ఓఎంఆర్ షీట్, ఆన్సర్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోగలరు
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి