TSPSC Group 4 Results: తెలంగాణ గ్రూప్-4 ఫలితాల అప్డేట్
TSPSC Group 4 Results 2023 | తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఈ నెలాఖరులోగా ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేసి, అక్టోబర్ నెలలో ఫలితాలు ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం.
TSPSC Group 4 Results 2023 | తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఫలితాలను వీలైనంత త్వరగా ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. అక్టోబర్ నెలలో ఫలితాలు ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెలాఖరులోగా ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేయనున్నట్టు తెలిసింది. ‘కీ’ విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలకు 5 నుంచి 7 రోజులు అవకాశం ఇస్తారు. వచ్చిన అభ్యంతరాలపై నిపుణులతో కమిషన్ పరిశీలిస్తుంది. తర్వాత 15 రోజుల్లో ఫైనల్ ‘కీ’ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్-4 పరీక్ష రాసిన మొత్తం 7,62,872 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేయాలని కమిషన్ భావిస్తున్నది. రాష్ట్రంలో నవంబర్ నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అక్టోబర్ నెలలోనే గ్రూప్-4 ఫలితాలు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. గ్రూప్-4 క్యాటగిరీలో వివిధ విభాగాల్లో 8,180 ఉద్యోగాల భర్తీకి జూలై ఒకటిన పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలు రాసిన వారిలో ఒక్కో పోస్టుకు సగటున 93 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి