TSPSC Group 4 Notification 2022 | 8039 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల | అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, సిలబస్ వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ని విడుదల చేశారు. మొత్తం 8039 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 98 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్ జూనియర్ అకౌంటెంట్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతల వివరాలు:
ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. BC, SC, ST & EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం:
రెండు పేపర్లు ఉంటాయి, ప్రతి పేపర్ నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు, పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 300 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.
క్రింద ఉన్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోగలరు, అప్లై ఆన్లైన్ అనే లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు.
Notification Link
Apply Online