TSPSC Group-1:- గ్రూప్-1 ఫైనల్ ‘కీ’ విడుదల.. 8 ప్రశ్నలు డిలీట్ చేశారు..వీటికి మార్కులు కలుపుతారు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ‘కీ’ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ ‘కీ’ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11 వ తారీఖున నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని జూన్ 28న విడుదల చేసిన అధికారులు.. జులై 1 నుంచి 5 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. దాని ఆధారంగా తాజాగా ఫైనల్ ‘కీ’ని విడుదల చేశారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత 8 ప్రశ్నలను తొలగించారు. వీటికి మార్కులు కలపనున్నారు. మరో రెండు ప్రశ్నలకు సమాధానాలను కమీషన్ సవరించింది. ఇదే ఫైనల్ కీ అని, ఇకపై ఎలాంటి మార్పులు ఉండవని కమీషన్ తెలిపింది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ ‘కీ’ ని డౌన్లోడ్ చేసుకోగలరు.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి