TSPSC Group 1: గ్రూప్-1 రాతపరీక్ష తేదీ ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11నే నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పరీక్షను Offline లో ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత సంవత్సరం ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. ఆ పరీక్ష ద్వారా 25,050 మందిని మెయిన్స్ కు ఎంపిక చేసింది. ఈలోగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడింది. దీంతో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసింది.
మళ్లీ కొత్తగా జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తేదీ ప్రకటించింది. పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రణాళికలన్నీ సిద్ధం చేసింది. అభ్యర్థులు అనవసరపు ప్రచారాలు నమ్మకుండా ప్రిపరేషన్ కొనసాగించాలని, షెడ్యూల్ ప్రకారమే జూన్ 11నే పరీక్ష జరుగుతుందని టీఎస్పీఎస్సీ తెలిపింది. నోటిఫికేషన్ లో పొందుపరిచినట్టే ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష జరుగుతుందని తెలిపింది.
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి