TS Govt Jobs 2023: వచ్చే 6 నెలల్లో 80 వేల ఉద్యోగాలు భర్తీ.. మంత్రి హరీష్ రావు వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడిన, రద్దయిన పరీక్షలను తిరిగి నిర్వహిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ ఘటన దురదృష్టకరం అన్నారు. అయితే లీకేజీని రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా గుర్తించి బయట పెట్టిందని తెలిపారు. నిందితులపై కేసులు పెట్టి, కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఏప్రిల్ 2వ తేదీన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పై విషయాలు వెల్లడించారు.
ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి