TS District Court Junior Assistant Notification 2026 – తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత కలిగిన బెడ్తల దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
🏛️ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది
🎯 పోస్టుల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం ఒకే ఒక్క పోస్టు మాత్రమే ఉంది. జనరల్ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.. కాబట్టి ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
👩🎓 విద్యార్హతలు
ఈ ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
✅ వయోపరిమితి
18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉 ఎంపిక విధానం
రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు రాత పరీక్ష 80 మార్కులకు ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది
🌐 దరఖాస్తు విధానం
- ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు ఫారం కొరకు క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ తో పాటు ఉన్న దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకొని, పూర్తిగా నింపి, దరఖాస్తు ఫారంతో పాటు అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, దరఖాస్తు ఫీజు రిసిప్ట్ చేతపరచి దరఖాస్తు చేసుకోవలెను.
- 24-03-2026 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
💰 దరఖాస్తు ఫీజు
- OC, BC అభ్యర్థులు: రూ.800/-
- SC, ST అభ్యర్థులు: రూ.400/- ఫీజు చెల్లించాలి
📃 దరఖాస్తులు పంపవలసిన చిరునామా
CHAIRMAN, DISTRICT LEGAL SERVICES AUTHORITY, DISTRICT COURT PROMISES MAHABUBABAD.

