తెలంగాణ విద్యుత్ శాఖలో 3,500 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | TGSPDCL JLM Notification 2024
తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం), AE పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేయడానికి డిస్కంలు రంగం సిద్ధం చేశాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్), వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎన్ఎస్పీడీసీఎల్)ల్లో కలిపి 3,500 వరకు జేఎల్ఎం, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటన జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. TGSPDCL లో 1,550 వరకు జేఎల్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.. జేఎల్ఎంతో పాటు 50 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకూ టీజీఎస్పీడీసీఎల్ నియామక ప్రకటన జారీ చేయనుంది. మహిళా అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయటానికి అర్హులు.
జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు ఐటిఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్) చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఈ ఉద్యోగాలకు బీటెక్ (ఎలక్ట్రికల్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.