Postal Department Jobs: పోస్టల్ శాఖలో 1,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు
Postal Jobs: తపాలా శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,899 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 డిసెంబర్ 9వ తారీకు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
పోస్టల్ అసిస్టెంట్: 598 ఖాళీలు
సార్టింగ్ అసిస్టెంట్: 143 ఖాళీలు
పోస్ట్ మ్యాన్: 585 ఖాళీలు
మెయిల్ గార్డ్: 3 ఖాళీలు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 570 ఖాళీలు
మొత్తం పోస్టుల సంఖ్య: 1,899
విద్యార్హతలు:
10th క్లాస్/ఇంటర్మీడియట్/ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
పోస్టల్ అసిస్టెంట్: 18-27 సంవత్సరాలు
సార్టింగ్ అసిస్టెంట్: 18-27 సంవత్సరాలు
పోస్ట్ మ్యాన్: 18-27 సంవత్సరాలు
మెయిల్ గార్డ్: 18-27 సంవత్సరాలు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 18-25 సంవత్సరాలు
జీతభత్యాలు:
పోస్టల్ అసిస్టెంట్:
రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు
సార్టింగ్ అసిస్టెంట్:
రూ.25,500/- నుంచి రూ.81,100/- వరకు
పోస్ట్ మ్యాన్:
రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు
మెయిల్ గార్డ్:
రూ.21,700/- నుంచి రూ.69,100/- వరకు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్:
రూ.18,000/- నుంచి రూ.56,900/- వరకు
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.100/- ఫీజు చెల్లించాలి.
SC/ST/EWS/ మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 డిసెంబర్ 9వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2, గ్రామ సచివాలయం టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి