56వేల జీతంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NPCIL Recruitment 2024
56 వేలకు పైగా జీతంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ- న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 400 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: 400 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
మెకానికల్: 150
కెమికల్: 73
ఎలక్ట్రికల్: 69
ఎలక్ట్రానిక్స్: 29
ఇన్స్ట్రుమెంటేషన్: 19
సివిల్: 60
విద్యార్హతలు:
సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో BE/B.Tech విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2024 ఏప్రిల్ 30వ తారీకు నాటికి 26 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.56,100/- జీతం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
గేట్ 2022/ 2023/ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.500/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఏప్రిల్ 30వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి