తెలుగు భాష ఖచ్చితంగా రావాలి.. ఏదైనా డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NICL Assistant Notification 2024
NICL Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. తెలుగు భాష రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
అసిస్టెంట్: 500 పోస్టులు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో: 21 ఖాళీలు
- తెలంగాణ రాష్ట్రంలో: 12 ఖాళీలు
👉విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ప్రాంతీయ భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి.
👉వయోపరిమితి:
01-10-2024 తేదీ నాటికి 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- వికలాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
నెలకు ₹.22,405/- నుంచి ₹.62,265/- వరకు జీతం ఉంటుంది.
👉ఎంపిక విధానం:
ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
రూ.850/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు: రూ.100/- ఫీజు చెల్లించాలి.
👉దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
24-10-2024 తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
11-11-2024 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం:- TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.