అటవీ శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | ICFRE IFB Recruitment 2025
అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ
ICFRE ఇండియన్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉంటుంది. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తుz ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
ఉద్యోగాలు భర్తీ చేసే సంస్థ
ICFRE ఇండియన్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది.
పోస్టుల వివరాలు
- జూనియర్ ప్రాజెక్టు ఫెలో: 01 పోస్టు
- ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు
విద్యార్హతలు
వయోపరిమితి
28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మహిళ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, బిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలకు నెలకు 24,000 జీతం ఉంటుంది; ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నెలకు 19,000 జీతం ఉంటుంది.
ఎంపిక విధానం
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
దరఖాస్తు విధానం
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఫారం ఉంటుంది. అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకొని, అప్లికేషన్ ఫారం భర్తీ చేసి.. మీ యొక్క ధ్రువపత్రాలను ఒక సెట్ జిరాక్స్ కాపీలు జతపరిచి ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ
10-01-2025 తేదీన ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము
ICFRE – Institute of Forest Biodiversity, Dulapally, Kompally (S.O.), Hyderabad- 500100.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
▶️ తెలంగాణ నిరుద్యోగుల కోసం: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SI-కానిస్టేబుల్ ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం 399 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతోంది. కింది లింక్ పై క్లిక్ చేసి AP Install చేసుకుని. మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.