November 20, 2024
AP Govt Jobs

APSRTC Recruitment: ఆర్టీసీలో రాతపరీక్ష లేకుండా 311 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

APSRTC Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ నందు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 31 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదవ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), ఫిట్టర్, మెషనిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ డీజిల్.

10th క్లాస్ పాసై సంబంధిత ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రూ.118 ఫీజు చెల్లించాలి.

Online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ పూరించాలి.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి తమ ప్రొఫైల్, అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్, పదవ తరగతి మార్కుల జాబితా, ఐటిఐ మార్కుల జాబితా, కుల దృవీకరణ పత్రము, ఆధార్ కార్డు,.. తదితర ఒరిజినల్ ధ్రువపత్రాలు,  2 సెక్స్ జిరాక్స్ కాపీలు, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో, RESUME కాపీని తీసుకొని క్రింద తెలిపిన చిరునామాలో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ నందు గల జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల వద్దకు ఉదయం 10 గంటలకు హాజరు కావలెను.

06-11-2024 తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

20-11-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ధ్రువపత్రాల పరిశీలన జరుగు తేదీలు:

ధ్రువపత్రాల పరిశీలన జరుగు తేదీలు దినపత్రికల ద్వారా గాని, APSRTC వెబ్సైట్ www.apsrtc.gov.in ద్వారా గాని తెలియజేయబడును.

Notification Link

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!