AP TET Results: టెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్ చేసి ఫలితాలు డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు విడుదల చేశారు. ఈరోజు (నవంబర్4) ఉదయం 11.30 గంటలకు ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 1,87,256 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలో అర్హత సాధించారు. అభ్యర్థులు క్రింది వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను చూసుకోవచ్చు.
అక్టోబరు నెలలో జరిగిన టెట్ కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలు రాశారు. వీరిలో 1,87,256 (50.79%) మంది అభ్యర్థులు టెట్ పరీక్షలో అర్హత సాధించారు. టెట్ పరీక్షలో అర్హత సాధించినవారికి డీఎస్సీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకు ముందు టెట్ అర్హత సర్టిఫికెట్ ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటయ్యేది. 2022 నుంచి దీన్ని జీవిత కాలానికి మార్చారు. 2022 టెట్లో చాలామంది అర్హత సాధించినా మార్కుల్లో మెరుగుదల కోసం చాలామంది ఇప్పుడు మరోసారి పరీక్ష రాశారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. నవంబర్ 6న 16,347 పోస్టులతో మెగాడీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న నేపథ్యంలో టెట్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగింది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి టెట్ ఫలితాలను చూసుకోగలరు