December 7, 2024
AP Govt Jobs

APPSC: ఈ నెలలోనే ఏపీపీఎస్సీ 23 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల.. 1600 పైగా పోస్టులు భర్తీ | గ్రూప్-2, గ్రూప్-1, JL, DL…

APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త తెలిపింది. ఈ నెలాఖరు లోపు గ్రూప్-1 & గ్రూప్-2తో పాటు 23 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. నవంబర్ చివరిలోపు 900 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్, 100 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2024 ఫిబ్రవరిలో గ్రూప్-1 & గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లతో పాటు డిగ్రీ కాలేజ్ లెక్చరర్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ నోటిఫికేషన్ల ద్వారా 1,600 పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

✅అతి తక్కువ ధరలో AP గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

Download Our APP

✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

ఈ నెలలో రానున్న ఉద్యోగ నోటిఫికేషన్లు:

1).గ్రూప్-2: 900
2).గ్రూప్-1: 89+ (క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కలిపి మొత్తం 100 వరకు)
3).లైబ్రేరియన్స్ ఇన్ ఏపీ కాలేజీ ఎడ్యుకేషన్: 23
4).డిగ్రీ కాలేజీ లెక్చరర్స్: 267
5).ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ జేఎల్స్: 10
6).ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ డీఎల్స్: 05
7).టీటీడీ డీఎల్స్, జేఎల్స్: 78
8).ఇంగ్లిష్ రిపోర్టర్స్(ఏపీ లెజిస్లేచర్ సర్వీస్): 10
9).జూనియర్ లెక్చరర్స్ (లిమిటెడ్): 47
10).అసిస్టెంట్ కెమిస్ట్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ సర్వీస్:01
11).జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్: 06
12).అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్: 03
13).అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్: 01
14).టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్: 04
15).సంక్షేమశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్స్: 02
16).జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరి-2): 01
17).సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరి-3): 04
18).జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరి- 4): 06
19).డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్: 38
20).ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్: 04
21).జూనియర్ అసిస్టెంట్స్ (జైళ్లు): 01
22).పాలిటెక్నిక్ లెక్చరర్స్: 99
23).లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్: 02

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!