AP Job Calendar 2024 | త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల.. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి వెల్లడి
AP Job Calendar 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా తెలిపారు.
✅AP గ్రూప్-2 Mains, AP SI/Constable, SSC GD Constable, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే 16 వేలకు పైబడి టీచర్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారన్నారు.
జాబ్ క్యాలెండర్ ద్వారా పోలీస్ శాఖలోని ఎస్ఐ, కానిస్టేబుల్; ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, డీఎస్సీ.. తదితర ఉద్యోగాల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.