APPSC Group-2 | గ్రూప్-2 ప్రీవియస్ ప్రశ్నలు (ఇండియన్ హిస్టరీ – వేద కాలం)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త సిలబస్ ప్రకారం నిర్వహించే గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షలో ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి గత గ్రూప్-2 పరీక్షల్లో చాప్టర్ వారీగా వచ్చిన ప్రీవియస్ ప్రశ్నలు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నలను క్షుణ్ణంగా చదివి రాబోయే గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధం అవ్వగలరు. రాబోయే గ్రూప్-2 పరీక్షలో ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి చాప్టర్ వారీగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అనే దానిపై అవగాహన పెంచుకోగలరు.
1).ఋగ్వేదం ఏ కాలం నాటిది?
1.క్రీ.పూ.1000
2.క్రీ.పూ.4500
3.క్రీ.పూ.1500
4.క్రీ.పూ.1500-1000
Ans: 4
2).ఏ వేదాన్ని సంగీత పరమైన కృతిగా పరిగణించారు?
1.ఋగ్వేదం
2.యజుర్వేదం
3.సామవేదం
4.అధర్వణ వేదం
Ans: 3
3).మొత్తం పురాణాల సంఖ్య?
1.18
2.20
3.12
4.16
Ans: 1
4).వధువును డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతి?
1.అసుర
2.పైశాచ
3.ప్రజాపత్య
4.రాక్షస
Ans: 1
5).ప్రఖ్యాత ఇతిహాసం మహాభారతాన్ని రచించింది ఎవరు?
1.వాల్మీకి
2.పతాంజలి
3.భవభూతి
4.వేదవ్యాస్
Ans: 4
6).ఉపనిషత్తులు క్రింది వాటిలో దేనికి సంబంధించిన గ్రంథాలు?
1.మత సంస్కారాలు
2.యోగ
3.తత్వశాస్త్రం
4.సామాజిక శాసనం
Ans: 3
7).గోత్ర అను పదం మొదటిసారి వాడబడిన వేదం?
1.సామవేదం
2.ఋగ్వేదం
3.అధర్వణ వేదం
4.యజుర్వేదం
Ans: 3
అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి