APPSC Group-2 Mains: జూలై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహణ.. మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ ఇదే
APPSC Group-2 Mains 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను జూలై 28వ తారీకు నుంచి నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ – ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల యొక్క లిస్టును అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోగలరు.
గతేడాది 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పోస్టుల సంఖ్య 905 కు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 45 రోజుల రికార్డు వ్యవధిలో గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేశారు.
మొత్తం 92,250 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను 2024 జులై 28వ తారీకు నుంచి నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో తెలిపింది.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 & పేపర్-2) ఉంటాయి. ప్రతి పేపర్ నుంచి 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 పరీక్షలో భారత దేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్ పరీక్షలను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు.
క్రింది లింక్ పై క్లిక్ చేస్తే గ్రూప్-2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి.
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 Mains ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.